: జగన్ నేర చరిత్రే వైఎస్సార్సీపీకి శాపం: హీరో శివాజీ
సినీ హీరో శివాజీ ఈ రోజు విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్, వైఎస్సార్సీపీలపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. జగన్ కు గల నేర చరిత్రే వైఎస్సార్సీపీ కొంప ముంచుతుందని అన్నారు. ఆయన చేసిన అంతులేని అవినీతి ఆ పార్టీకి ఓట్లు పడనీయకుండా చేస్తుందని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో, సీమాంధ్ర అభివృద్ధి బాటలో సాగాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబుల పాలన రావాల్సిన అవసరం ఉందని అన్నారు.