: ఆ అధికారం ఎన్నికల సంఘానికి ఉంది: సుప్రీంకోర్టు
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చేసే గిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. అఫిడవిట్లలో పేర్కొనే స్థిర, చరాస్తుల దగ్గర నుంచి ఎన్నికల ఖర్చు వరకు అన్నీ తప్పుడు లెక్కలే. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల ఖర్చును తప్పుగా చూపిస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించింది. ఎన్నికల ఖర్చుకు తప్పుడు లెక్కలు చూపించే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని తేల్చి చెప్పింది.