: నేడు అమేథీలో మోడీ ప్రచారం
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం నేడు అమేథీలో జరగనుంది. ఇక్కడి నుంచి పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి స్మృతి ఇరానీని గెలిపించే దిశగా ఆయన ప్రసంగం సాగనుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కంచుకోట అయిన అమేథీలో బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో తమ్ముడి కోసం ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు. అటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారో?