: తన అల్లుడికి ఓటేయాలని కోరిన సూపర్ స్టార్ కృష్ణ


గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన అల్లుడు గల్లా జయదేవ్ కు ఓటు వేయాలని ప్రముఖ సినీ నటుడు కృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం ఇచ్చారు. తన అల్లుడు బాగా చదువుకున్న వాడు, మంచి పారిశ్రామికవేత్త, సమాజానికి మేలు చేయాలన్న తపన గలవాడు అంటూ కితాబిచ్చారు. గుంటూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న తపన జయదేవ్ కు ఉందని... తను కచ్చితంగా గుంటూరు లోక్ సభ నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళతాడన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. గతంలో తాను గుంటూరు నుంచి పోటీ చేయాలని భావించానని... కానీ, అప్పుడు కుదరలేదని... ఇప్పుడు తమ కుటుంబం నుంచి మరొకరు పోటీ చేస్తుండటంతో ఆ కోరిక తీరిపోయిందని చెప్పారు.

  • Loading...

More Telugu News