: గిరిజన మహిళకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
ఇంటింటికీ తిరిగి పోలియో నివారణకు విశేష కృషి చేసిన బీహార్ గిరిజన మహిళ మార్తాడోడ్రేకు ప్రతిష్ఠాత్మక ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం లభించింది. బీహార్ లోని దర్భంగా జిల్లా, కుషేశ్వర్ స్థాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 40 ఏళ్ల మార్తాకు మే 12న అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.