: సీమాంధ్రలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో రెండో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. ఈ సాయంత్రంతో సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ప్రచార హోరు నిలిచిపోనుంది. గత కొన్ని రోజులుగా నిరవధికంగా హోరెత్తించిన మైకులు మూగబోనున్నాయి. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో తలమునకలైన వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు సేదతీరనున్నారు. ఈ నెల 7వ తేదీన సీమాంధ్రలోని అన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం కోడ్ ప్రకారం ఈ సాయంత్రం నుంచి ఏ అభ్యర్థి కూడా ప్రచారం నిర్వహించకూడదు. ఓటర్లను కలసి ప్రలోభపెట్టే యత్నాలు చేయకూడదు.