: రేపు సాయంత్రం 4 గంటలకి ప్రచారం నిలిపేయాలి: భన్వర్ లాల్


సీమాంధ్రలో రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ భన్వర్ లాల్ రాజకీయ పార్టీలను హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రేపు సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ప్రచారం ముగించాలని స్పష్టం చేశారు. రేపు సాయంత్రం 4 గంటల తరువాత ఎవరైనా ప్రచారం చేసినట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News