: నాకే అధికారముంటే...మీడియా తాట తీస్తా: సర్వే సత్యనారాయణ
తనకే గనుక అధికారముంటే మీడియా తాట తీస్తానని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మీడియా అంత అవినీతి వ్యవస్థ మరొకటి లేదని అన్నారు. ఎవరు డబ్బిస్తే వారికే మీడియా వత్తాసు పలుకుతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఛానెల్ ఏదో ఒక పార్టీకి వత్తాసు పలుకుతోందని ఆయన అన్నారు. మీడియా సంస్థలు స్వార్థానికి పని చేస్తున్నాయని ఆయన ఏకిపడేశారు.
పేపర్, టీవీ అన్నీ భ్రష్టుపట్టిపోయాయని సర్వే ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరన్నా టీవీలు, పేపర్లను విమర్శిస్తే వారిమీద స్టింగ్ ఆపరేషన్ అంటూ వార్తలు ప్రసారం చేస్తారని ఆయన విమర్శించారు. అవినీతిమయమైపోయిన మీడియా అవినీతి గురించి మాట్లాడుతోందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జర్నలిస్టులను కూడా మీడియా సంస్థలు బతకనివ్వడం లేదని ఆయన అన్నారు.