: రాష్ట్ర విభజన పిటిషన్లపై రేపు సుప్రీంలో విచారణ
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన 24 పిటిషన్లపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. మొత్తం 24 పిటిషన్లలో 23 పిటిషన్లను మన రాష్ట్రానికి చెందిన వారు వేశారు. ఒక పిటిషన్ ను మాత్రం ఢిల్లీకి చెందిన మనోహర్ లాల్ శర్మ అనే న్యాయవాది వేశారు. జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎం.వై.ఇక్బాల్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేల త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లు అన్నింటినీ కలిపి ఒకేసారి వాదనలు విననుంది. రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.