: బీసీలంతా టీడీపీకే మద్దతు పలకాలి: ఆర్.కృష్ణయ్య


సీమాంధ్ర అభివృద్ధి కోసం బీసీలు అందరూ టీడీపీ-బీజేపీ కూటమికే ఓటు వేయాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దశ, దిశ లేవని అన్నారు. టీడీపీ-బీజేపీ కూటమి గెలుపు చారిత్రక అవసరమని, అవినీతి పరుల చేతిలో రాష్ట్రాన్ని ఉంచితే సీమాంధ్ర అభివృద్ధి చెందదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి, నరేంద్రమోడీ ప్రధాని అవుతారని అన్న కృష్ణయ్య, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ-బీజేపీ కూటమికి ఓటు వేసి గెలిపించాలని సూచించారు. అలా జరిగితే కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో నిధులు రాబట్టుకోవచ్చని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News