: ఎన్నికల తర్వాత జనసేన కార్యవర్గం ఏర్పాటు: పవన్ కల్యాణ్
ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ తరపున జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రసంగిస్తూ దూసుకుపోతున్నారు. పవన్ సభలకు టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ భవిష్యత్తు ఏమిటనే సందేహం అందర్లోను నెలకొంది. ఇప్పటి వరకైతే జనసేన అధినేత పవన్ ఒక్కరే పార్టీలో ఉన్నారు. పార్టీని పూర్తి స్థాయిలో విస్తరిస్తారా? లేక వచ్చే ఎన్నికల వరకు ఇలాగే కొనసాగిస్తారా? అనే సంశయం చాలా మందిలో ఉంది. ఈ రోజు గుంటూరు జిల్లా బాపట్ల సభలో ఈ ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. ఎన్నికలయిన తర్వాత పార్టీని విస్తరిస్తామని... కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సో, ఎన్నికల తర్వాత జనసేన పార్టీ మరింతగా యాక్టివ్ అవుతుందన్నమాట.