: చేపల వ్యాపారి ఇంట్లో 30 లక్షలు స్వాధీనం
మచిలీపట్నంలోని ఓ చేపల వ్యాపారి ఇంట్లో పోలీసులు 30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హైస్కూలు ప్రక్కనే ఉన్న చేపల వ్యాపారి షేక్ బాజీ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 30 లక్షల రూపాయలను ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు.