: నేను బయట ఉంటా... జగన్ జైల్లో ఉంటాడు: చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లా ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ప్రొద్దుటూరులో ఆయన రోడ్ షో నిర్వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంటామని... కడపలో హజ్ హౌస్ ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులకు, చేనేత కార్మికులకు రూ. 2 లక్షలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. అమ్మాయిలకు సెల్ ఫోన్లను ఇస్తామని, రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో వైకాపా అధినేత జగన్ పై విరుచుకుపడ్డారు. లక్ష కోట్లు దోచుకున్న వాడికి జైలు శిక్ష పడదా? అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత తాను బయట ఉంటానని, జగన్ జైళ్లో ఉంటాడని తెలిపారు. కడప జిల్లాలో వైఎస్ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News