: ఇంజనీరింగ్ కు తగ్గాయి...మెడిసిన్ కు పెరిగాయి: ఎంసెట్ కో కన్వీనర్
ఇంజనీరింగ్ విద్యకు ఎంసెట్ లో ఆదరణ తగ్గిందని, గత ఏడాది కంటే 10 వేల దరఖాస్తులు తగ్గాయని ఎంసెట్ కో కన్వీనర్ ఈశ్వరప్రసాద్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ అదే సమయంలో మెడిసిన్ కు డిమాండ్ పెరుగుతోందని... గతేడాది కంటే 8 వేల దరఖాస్తులు పెరిగాయని అన్నారు. ఈ నెల 22న నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షకు విద్యార్థులు ఒక్కనిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. కాపీయింగ్ అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.