: చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ కు జైళ్ల శాఖ డీజీ మెమో
చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ రావుకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) కృష్ణంరాజు మెమో జారీ చేశారు. చర్లపల్లి జైలులో గత రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్, మహ్మద్ పహిల్వాన్, యాదగిరిల వద్ద బిర్యానీ పాకెట్లు, సెల్ ఫోన్లు, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. దీంతో విధులు నిర్వర్తిస్తున్న అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.