: సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ నేతలందరూ ఓడిపోవడం ఖాయం: హరీష్ రావు
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేయబోతోందని ఆ పార్టీ నేత హరీష్ రావు అన్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ దేనని తెలంగాణ ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం కూడా టీఆర్ఎస్ తోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే భ్రమలో కొందరు టీకాంగ్ నేతలున్నారని... సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ నేతలందరూ ఓటమిపాలు కావడం ఖాయమని జోస్యం చెప్పారు.