: ఐపీఎల్ ప్రారంభ వేడుకలు షురూ


క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవం షురూ అయింది. వీక్షకులతో కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం ఇసుకేస్తే రాలనంతగా కిటకిటలాడుతోంది. ఆయా జట్ల సారథులు, ఆటగాళ్ళు ప్రస్తుతం మైదానంలో ఆసీనులయ్యారు. అంతకుముందు వారు మైదానంలో మార్చ్ పాస్ట్ నిర్వహించేశారు.

ఈ వేడుకల్లో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తో పాటు మెరుపుతీగ కత్రీనా కైఫ్, ఇంటర్నేషనల్ ర్యాప్ ఆర్టిస్ట్ పిట్ బుల్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇక స్టేడియం కెపాసిటీ 1,20,000 కాగా, మైదానం అభిమాన జనసంద్రాన్ని తలపిస్తోంది. ఈ ప్రారంభ వేడుకలకు బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీ లహరి, హస్కీ వాయిస్ తో మతులు పోగొట్టే గాయని ఉషా ఉతుప్ కూడా హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News