: అక్బర్ కేసును సర్కారు నీరుగారుస్తోంది: కిషన్


ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై నమోదైన వివాదాస్పద వ్యాఖ్యల కేసులను నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. అక్బరుద్దీన్ పై కేసులను జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని డిమాండ్ చేసారు. అలాగే, మతం ముసుగులో అక్రమ ఆస్తులను కూడబెట్టిన బ్రదర్ అనిల్ కుమార్ (షర్మిల భర్త) ఆస్తులపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. మత విద్వేషాలను రగిలించే వారికి వ్యతిరేకంగా బీజేపీ పోరు సాగిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News