: ప్రధాని కుర్చీలో ఎవరు కూర్చోవాలో మనమే డిసైడ్ చేద్దాం: జగన్
రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామని... ప్రధాని కుర్చీలో ఎవరు కూర్చోవాలో మనమే డిసైడ్ చేద్దామని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వట్లూరులో రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఆడతారని... రాష్ట్ర బడ్జెట్ కు మించిన హామీలను ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలు కనుమరుగైపోతారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర దశ మారిపోయేలా 11 పనులు చేస్తానని తెలిపారు. విశ్వసనీయతకు ఓటేసి వైఎస్ నాటి సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందామని అన్నారు.