: ఆ రెండు పార్టీలు వైఎస్ అవినీతిని కూడా పంచుకోవాలి: వెంకయ్యనాయుడు
కాంగ్రెస్, వైఎస్సార్సీపీలు వైఎస్ పథకాలు మావంటే మావని పోటీపడుతూ ప్రచారం చేసుకుంటున్నాయని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, ఆ రెండు పార్టీలు వైఎస్ అవినీతిని కూడా పంచుకోవాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. సీమాంధ్ర ఎన్నికల్లో పెద్ద ఎత్తున మద్యం, డబ్బు సంచులు బయటపడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీల వారిగా పట్టుబడిన మద్యం, నగదు వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.