: రెండు కిడ్నీలూ ఒకవైపునే
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు అరుదైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. సాధారణంగా ప్రతి ఒక్కరికి వెనుకవైపు నడుము పై భాగంలో కుడి, ఎడమ పక్కన ఒక్కో కిడ్నీ ఉంటాయి. కానీ 24 ఏళ్ల శంషద్ కు మాత్రం రెండు కిడ్నీలు ఒక వైపే ఉన్నాయి. అవి ఒకదానిపై మరొకటి ఉన్నట్లు లక్నోలోని బలరాంపూర్ హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. దీన్ని మాల్ రొటేటెడ్ కిడ్నీ వ్యాధిగా పేర్కొంటారని, ప్రతీ లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఇలా ఉండే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు.