: హామీలతో ప్రజల్ని మభ్యపెడుతున్నాయి: జేపీ
టీడీపీ, వైఎస్సార్సీపీలు ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లా వెల్లూరులో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రలో ఏడాదికి 13 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంటుందని తెలిపారు. దీనిని ఎలా భర్తీ చేస్తారో చెప్పని పార్టీలన్నీ పెద్దపెద్ద హామీలిస్తూ ప్రజల బలహీనతలతో ఆడుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. దేశంలో ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పించకపోతే యువత నిర్వీర్యమైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.