: వ్యాపారులకు అండగా ఉంటా: సీఎం రమేష్
వ్యాపారులకు అండగా ఉంటానని టీడీపీ నేత సీఎం రమేష్ హామీ ఇచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆర్య వైశ్య సంఘం నేతలతో సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఆయన వెల్లడించారు.