: సంజయ్ దత్ టాక్ షో త్వరలో
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను మిస్సవుతున్నామనే భావనలో ఉన్న వారికి శుభవార్త. సంజయ్ దత్ తో ఓ టాక్ షో రూపొందించడానికి ఆయన భార్య మాన్యతాదత్ సిద్ధం అవుతున్నారు. 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల సమయంలో అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నందుకు సంజయ్ దత్ పుణెలోని ఎరవాడ జైలులో జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జైలు నుంచి విడుదల చేసినప్పుడే ఆయన టాక్ షోలో పాల్గొనాల్సి ఉంటుంది. నేరాలకు సంబంధించిన అంశాల ఆధారంగా ఈ కార్యక్రమం ఉండనుంది.