: మోటరోలా నుంచి మరో స్మార్ట్ ఫోన్
మోటో జీ విజయం సాధించడంతో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయానికి మోటరోలా సమాయత్తం అవుతోంది. మోటో ఈ పేరుతో రానున్న ఈ ఫోన్లో 4.3 అంగుళాల స్క్రీన్, 1.2 గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5 మెగాపిక్సెల్స్ కెమెరా, 1,900 మిల్లీ యాంపీ అవర్స్ బ్యాటరీ తదితర సదుపాయాలు ఉన్నాయి. మరింత మందికి చేరువ కావడానికి మోటరోలా తీసుకొస్తున్న ఈ ఫోన్ ధర మోటో జీ కంటే తక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ నెల 12న భారత్, యూకేలో విడుదల చేయనున్నట్లు సమాచారం. మోటో జీ 12 వేల రూపాయలకు పైన ఉంది.