: పులివెందులలో వెబ్ కెమెరాలు, వీడియోగ్రాఫర్ల ఏర్పాటు: కడప ఎస్పీ
కడప జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ సమస్య ఉందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లో ప్రత్యేక సిబ్బందిని కేటాయిస్తున్నామని చెప్పారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు పోలింగ్ బూత్ లలో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, వీడియోగ్రాఫర్లను కూడా నియమిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనావేస్తూ, పోలింగ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.