: నా పేరు మీద చిల్లి గవ్వ చూపించినా జీవిత ఖైదుకి సిద్ధం: ఎ.రాజా
దేశంలో అతి పెద్ద కుంభకోణం 2జీ స్కాం నిందితుడు, మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా సవాలు విసురుతున్నారు. తన పేరు మీద ఓ డాలరు లేదా ఓ రూపాయి చూపించినా తాను జీవితాంతం జైలులో ఉండేందుకు సిద్ధమని ప్రకటించారు. రాజాపై ఓ ఇంగ్లీష్ దినపత్రిక పెద్ద కథనాన్ని ప్రచురించింది. దీంతో ఆయన ఆ కథనాన్ని ఈడీ, సీబీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సవాలుపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. బినామీల సంస్కృతి రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన దగ్గర చిల్లిగవ్వ లేకపోవడం విశేషమేమీ కాదని అభిప్రాయపడుతున్నారు.