: 'సీఎం వచ్చే దాకా శవాలను పాతిపెట్టడానికి లేదు'


అసోంలో బోడోలాండ్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తమ ప్రాంతాన్ని సందర్శించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ వారి దేహాలను సమాధి చేసేది లేదని వారు పట్టుబడుతున్నారు. సీఎం వచ్చే దాకా 18 మందికి అంత్యక్రియలు నిర్వహించేది లేదని నన్కేంద్రబారిలో స్థానికులు నిరసన ప్రదర్శనలకు దిగారు. తమపై భవిష్యత్తులో దాడులు జరగకుండా భద్రతకు భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News