: ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పదిలంగా ఉంది: చిరంజీవి
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు తగ్గలేదని... అందరి గుండెల్లో పదిలంగానే ఉందని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, వైకాపా అధ్యక్షుడు జగన్ రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుది ఆఖరి పోరాటం అయితే... జగన్ ది ఆత్మరక్షణ పోరాటమని ఎద్దేవా చేశారు. విజయనగరంలో రోడ్ షో సందర్భంగా చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.