: నితీశ్ పై శరద్ యాదవ్ నిప్పులు


జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ తన సొంత పార్టీ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై ఒక్కసారిగా విమర్శల వర్షం కురిపించారు. కుల రాజకీయాల నుంచి బయట పడలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ముజఫర్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఇద్దరూ రాజకీయాల్లో తన నీడలో ఎదిగినవారేనని చెప్పారు. కానీ, కుల రాజకీయాల నుంచి బయటపడలేకపోతున్నందుకు బాధ కలుగుతోందన్నారు. కుల రాజకీయాలతో లాలూ బీహార్ ను సర్వనాశనం చేశారని, ఇప్పుడు నితీశ్ కూడా ఆయన బాటలోనే సాగుతున్నారని దుమ్మెత్తి పోశారు. అయితే, శరద్ యాదవ్ ఒక్కసారిగా ఇలా నితీశ్ ను విమర్శించడం అసాధారణమే. నితీశ్ కు దూరంగా ఉండడంతోపాటు, తిరిగి బీజేపీకి దగ్గరయ్యేందుకు ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News