: విభజనకు ఆజ్యం పోసింది వైఎస్సే: జేపీ


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 లో రాష్ట్ర విభజనకు ఆజ్యం పోశారని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఆరోపించారు. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించవచ్చని గతంలో జగన్ చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు... తెలంగాణకు కట్టుబడి ఉన్నామని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా చెప్పారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జేపీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన అంశంలో అన్ని పార్టీల ప్రమేయం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News