: రాజకీయాల్లో టెస్ట్ మ్యాచ్ ఆడతా: కైఫ్
ప్రజలకు చేరువ కావడానికి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకే ఇక్కడున్నానంటూ మహమ్మద్ కైఫ్ క్రికెట్ పరిభాషలో చెప్పారు. కాంగ్రెస్ తరపున ఉత్తరప్రదేశ్ లోని ఫూల్ పూర్ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల జీవితాలను మార్చడానికి తనకిది ఒక అవకాశంగా భావిస్తానని ఆయన చెప్పారు. ఫూల్ పూర్ నుంచి తప్పకుండా విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే లౌకకవాద పార్టీ అని, భారత జట్టు వలే తన సత్తా ఏంటో చూపిందన్నారు.