: మోడీ, జగన్ లపై మండిపడ్డ మేథాపాట్కర్


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, వైఎస్సార్సీపీ అధినేత జగన్ లపై ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేథాపాట్కర్ విరుచుకుపడ్డారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని అంతులేని భూకబ్జాలకు పాల్పడ్డ భూబకాసురుడు జగన్ అని... తాను చేసిన తప్పులకు ఇప్పటికే 16 నెలలపాటు జైలు జీవితం కూడా గడిపారని చెప్పారు. చివరకు విజయనగరం లాంటి చిన్న పట్టణాన్ని కూడా జగన్ వదల్లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని వక్ఫ్ భూములను వైఎస్ కుటుంబం మింగేసిందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అలాగే బీజేపీపై కూడా మేథాపాట్కర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ముస్లిం సమాజం వ్యతిరేకించే బీజేపీ, మోడీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. మైనార్టీలపై వీహెచ్ పీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా చేస్తున్న వ్యాఖ్యలు ఆక్షేపణీయమని చెప్పారు. రాజకీయాల్లో సమూలమైన మార్పులు కోరుకుంటున్న వారంతా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. ఈ రోజు విశాఖపట్నంలో ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ, మేథాపాట్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News