: 'ఆంధ్రా ఆక్టోపస్' లగడపాటి జోస్యం
ఎన్నికలు అనగానే లగడపాటి సర్వే కోసం రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎప్పట్లానే ఇప్పుడు కూడా లగడపాటి జోస్యం చెప్పారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ ఏక పక్ష విజయం సాధిస్తుందని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. తొలి దశలో 75.5 శాతం పోలింగ్ జరిగిందని ఆయన అన్నారు.
రెండో దశ పోలింగ్ లో 70 శాతం ఓటింగ్ జరిగితే, టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనీ, ఓటింగ్ శాతం పెరిగితే టీడీపీకి సీట్ల సంఖ్య మెజారిటీ శాతం పెరుగుతుందని ఆయన అన్నారు. సర్వేలు వెల్లడించకూడదు కనుక ఈ నెల 12 తరువాతే సీట్ల సంఖ్యను చెప్పగలనని ఆయన తెలిపారు. పార్లమెంటు స్థానాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎన్డీయే 270 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని లగడపాటి వెల్లడించారు.