: ప్రజాధనాన్ని దోచుకున్న నేతలకు తగిన బుద్ధి చెప్పండి: ఆమ్ ఆద్మీ పార్టీ


కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న రాజకీయ నాయకులను ఈ ఎన్నికల్లో ఓడించి జైలుకు పంపాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... ప్రజలకు అండగా నిలవాల్సిన నేతలు, ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని అన్నారు. ఇలాంటి నేతలకు ఈ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు సామాజిక బాధ్యత గలవారని, వారికి ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సమావేశంలో ఏఏపీ నేతలు అతిల్ మహ్మద్, ఎంపీ అభ్యర్థి జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News