: రాష్ట్రం ముక్కలయ్యేందుకు వైఎస్ పాలనే కారణం: పవన్ కల్యాణ్
సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ విశాఖ జిల్లా తగరపువలసలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ప్రత్యేక పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. వైఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని ఆయన విమర్శించారు. వైఎస్ హయాంలో చెరుకు రసం వారు తాగి... పిప్పిని మాత్రం ప్రజలకు మిగిల్చారని అన్నారు. రాష్ట్రం ముక్కలయ్యేందుకు వైఎస్ పాలనే కారణమని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజల సొమ్మేనని ఆయన చెప్పారు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితేనే దేశానికి మేలు జరుగుతుందన్నారు.