: ఈ-పుస్తకాలు.. యమపాశాలట..!


నూతన సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి యుగంలో 'ఈ-బుక్స్' ఓ సరికొత్త ఆవిష్కరణ. డెస్క్ పై పీసీనో.. చేతిలో స్మార్ట్ ఫోనో, ట్యాబ్లెట్టో, ఫ్యాబ్లెట్టో ఉంటే చాలు. పుస్తకాలు మన అరచేతిలో వాలుతాయి. అక్షరాలను అలా మనముందు పరుస్తాయి. ఫలానా పుస్తకం కావాలంటే ఓ గ్రంథాలయానికో, బుక్ షాప్ కో వెళ్ళాల్సిన అవసరం తప్పించిందీ 'ఈ-బుక్స్' సాఫ్ట్ వేర్. అయితే, ఇంతటి ప్రజాదరణ పొందిన సాంకేతికతపై పలు విమర్శలూ లేకపోలేదు.

తాజాగా, ఒడిశాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత నవలా రచయిత్రి ప్రతిభా రే ఏమంటున్నారో వినండి. 'ఈ-బుక్స్'.. పిల్లల్లో సృజనాత్మకతను చిదిమేయడంతో పాటు వారిలో ఊహాశక్తిని చంపేస్తాయని అంటున్నారు. 'ఓ చిన్నారి మామూలు పుస్తకం చదివితే, తాను చదివిన దాని గురించి మనసులో తన ఊహాశక్తిని ఉపయోగించి ఓ చిత్తరువును రూపొందించుకుంటాడు. అదే, ఈ-బుక్స్ పరిజ్ఞానంతో కంప్యూటర్లోనో, ఫోన్ లోనో పుస్తకం చదివితే, ఓ సినిమా చూసినట్టుగానే అనుభూతి చెందుతాడు' అని ప్రతిభ పేర్కొన్నారు.

ఈ-బుక్స్ ఎన్నటికీ ముద్రిత పుస్తకాలకు ప్రత్యామ్నాయాలు కాబోవని చెబుతూ, 5,000 ఏళ్ళ నాటి మహాభారతం ఇప్పటికీ సజీవంగా నిలవడమే అందుకు తార్కాణమని చెప్పారు. అయితే, పురాణ గ్రంథాలు పునర్ముద్రణకు నోచుకున్నప్పుడే అవి తర్వాతి తరాలకు చేరువ అవుతాయని ప్రతిభ అన్నారు. 

  • Loading...

More Telugu News