: ప్రమాదవశాత్తు ఫ్యాక్టరీ గోడ కూలి ముగ్గురి మృతి
ఛత్తీస్ గఢ్ లోని కర్మాగారంలో ప్రమాదవశాత్తు ఓ గోడ కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. రాయ్ పూర్ లో ని ఇనుప పైపులు తయారుచేసే ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు కార్మికులు కాగా, ఒకరు ఫ్యాక్టరీ సిబ్బంది ఉన్నారు. శుక్రవారం నాడు తుపాను కారణంగా సితార ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫార్చూన్ మెటల్ లిమిటెడ్ లో ఈ దుర్ఘటన జరిగిందని సిటీ ఎస్పీ రాజేంద్ర జైస్వాల్ చెప్పారు.