: ఆ డబ్బు ప్రజలదే...తీసుకోండి: పవన్ కల్యాణ్
వైఎస్సార్సీపీ నేతలు పంచుతున్న డబ్బు ప్రజలదేనని, ఆ డబ్బు తీసుకోవడానికి సంశయించవద్దని పవన్ కల్యాణ్ సూచించారు. అయితే డబ్బు తీసుకుని ఆ పార్టీకి ఓటు వేయవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన మాట్లాడుతూ, ఎప్పటికైనా జైలుకెళ్లే జగన్ ముఖ్యమంత్రి కావాలా? అని ప్రశ్నించారు. తెలుగు జాతి ఐక్యతకోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. తనకు పదవులు కావాలనుకుంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఉండేవాడినని పవన్ కల్యాణ్ వెల్లడించారు.