: విమానంలో సీటు కింద దాచిన బంగారం పట్టివేత
తమిళనాడులోని ట్యూటికోరన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ప్రవేటు విమానంలో సీటు కింద దాచిన కిలోన్నర బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. అక్కడ బంగారం దాచిన బ్యాగును చూసిన విమానాశ్రయ సిబ్బంది తమకు సమాచారం అందించారని, వెంటనే తాము స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దాని విలువ 45 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు.