: ఓ వ్యక్తిపై దాడి చేసి... చంపేసిన ఏనుగులు
త్రిపురలో అడవిలోకి వెళ్లిన ఓ వ్యక్తిపై దాడి చేసిన ఏనుగులు, అతడిని తొక్కి చంపేశాయి. పశ్చిమ త్రిపురలోని గోడైబరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భూపేంద్ర దేవ్ (32) అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి వెదురు తెచ్చుకునేందుకు అడవిలోకి వెళ్లాడు. ఉన్నట్టుండి ఏనుగుల గుంపు వారిద్దరిపై దాడి చేసింది. ఆ దాడిలో భూపేంద్ర అక్కడికక్కడే మరణించాడు. అతని స్నేహితుడు మాత్రం వాటి నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డాడు. ఈ విషయాన్ని ఖోవై సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సమిత్ రాయ్ మీడియాకు తెలిపారు. భూపేంద్ర కుటుంబానికి జిల్లా యంత్రాంగం ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు.