: విశాఖ ప్రజలపై 10 గంటల నుంచి 1 గంట వరకు హెలికాప్టర్ తో పూల వాన
విశాఖ లోక్ సభ స్వతంత్ర అభ్యర్ధి డాక్టర్ కూటికుప్పల సూర్యారావు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 5న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హెలికాప్టర్ లో విశాఖలోని ఏడు నియోజకవర్గాల ప్రజలపై పూల వాన కురింపించనున్నారు. ఇందు కోసం ఈసీ, సీపీ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. తనను గెలిపిస్తే విశాఖ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని కూటికుప్పల సూర్యారావు తెలిపారు.