: మోడీపై మళ్లీ నోరు పారేసుకున్న బేణీప్రసాద్


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కేంద్ర మంత్రి బేణీప్రసాద్ వర్మ మళ్లీ నోరు పారేసుకున్నారు. ఎన్నికల సంఘం చీవాట్లు పెడుతున్నా ఆయన మోడీపై వాగ్బాణాలను సంధిస్తూనే ఉన్నారు. తాజాగా 'మోడీ ఓ రాక్షసుడు' అంటూ బేణీప్రసాద్ వ్యాఖ్యానించి మరోసారి వార్తల్లోకెక్కారు. "మోడీ హిందూ ముస్లిముల మధ్య విబేధాలను, ద్వేషాన్ని రగిలించాడు. ఆయన ఓ మనిషి కాదు, రాక్షసుడు" అంటూ బేణీప్రసాద్ న్యూఢిల్లీలోని మస్కాన్వా టౌన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోడీపై నిప్పులు చెరిగారు.

నరేంద్ర మోడీపై ‘అవమానకర’ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలంటూ బేణీ ప్రసాద్ వర్మను రెండు రోజుల క్రితమే ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాల్సి వస్తుందని కూడా ఈసీ హెచ్చరించింది. అయినా, అమాత్యులకు ఇవేమీ పట్టినట్టు లేదు... బేణీ మాత్రం మోడీపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు.

  • Loading...

More Telugu News