: ఈ నెల 16న ఈడీ ఎదుట హాజరవుతా: విజయసాయిరెడ్డి
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట మళ్లీ ఈ నెల 16న హాజరవుతానని ఆడిటర్ విజయ సాయిరెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఈడీ ఎదుట విచారణ ముగిసింది. దాదాపు నాలుగు గంటలపాటు ఈడీ సాయిరెడ్డిని ప్రశ్నించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వాన్ పిక్ కు సంబంధించిన నాలుగో ఛార్జిషీట్ పైనే ఈడీ అధికారులు తనను ప్రశ్నించారని, వాటికే సమాధానాలు ఇచ్చానని చెప్పారు.
అయితే జగన్ కేసులో మొదటి దశ ఆస్తుల అటాచ్ మెంట్ కు సంబంధించి ఈడీ అథారిటీ నిర్ధారించిన అంశాలపై అప్పిలేట్ ట్రైబ్యునల్ కు అప్పీల్ చేశామని తెలిపారు. ఇదిలావుంటే, మూడో ఛార్జిషీట్ ఆధారంగా జగన్ అక్రమాస్తుల కేసులో మరో రూ.51 కోట్ల ఆస్తుల అటాచ్ మెంట్ కు ఈడీ సిద్ధమవుతోందని తెలుస్తోంది.