: తెలంగాణలో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు: ఈటెల
తెలంగాణలో తమ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి విధాన రూపకల్పన చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని ఆయన వెల్లడించారు.