: రుణమాఫీపై వైఎస్సార్సీపీకి అంత బాధ ఎందుకు?: రావుల


రైతు రుణమాఫీపై వైఎస్సార్సీపీకి అంత బాధ ఎందుకు? అని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వైఎస్సార్సీపీ నేతలు వేల ఎకరాలు కొల్లగొట్టారని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు కొల్లగొట్టిన డబ్బుతో రుణాలు మాఫీ చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సింగపూర్ బ్యాంకు నుంచి కడప జిల్లా వైఎస్సార్సీపీ అభ్యర్థికి 40 కోట్ల రూపాయలు అందాయని, వాటిని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News