: అమెరికాలో యువతిని అపహరించి అత్యాచారం చేసిన భారతీయుడు
అమెరికాలో భారత్ కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ (సిఖ్ మతానికి చెందిన) యువతిని అపహరించి అత్యాచారం చేసినట్లు నిర్ధారణ అయింది. 2011 మే నెలలో ఓ రోజు నైట్ పార్టీకి హాజరై తిరిగి ఇంటికి వెళ్లడానికి 29 ఏళ్ల మహిళ గుర్ మీత్ సింగ్(42) కు చెందిన క్యాబ్ లో ఎక్కింది. ఆపై తెలివిలేకుండా నిద్రపోయిన తనపై గుర్ మీత్ అత్యాచారం చేసినట్లు ఆమె ఆరోపించారు. స్పృహ వచ్చి చూసేసరికి తనపై గుర్ మీత్ ఉన్నాడని, నోట్లో కాగితాలు కుక్కి, చేతులు కట్టేసి, కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడని కోర్టుకు తెలిపింది. దీంతో గుర్ మీత్ అపహరించి అత్యాచారం చేశాడని బ్రూక్లిన్ సుప్రీంకోర్టు నిన్న తేల్చింది. అతడికి ఈ నెల 12న శిక్ష ఖరారు చేయనుంది. 25 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.