: అక్రమంగా తరలిస్తున్న 1142 మద్యం సీసాలు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోనిలో తనిఖీలు నిర్వహిస్తుండగా భారీగా మద్యం సీసాలు పట్టుబడ్డాయి. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 1142 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక మూడు ద్విచక్ర వాహనాలను, ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు.