: అఫ్ఘానిస్థాన్ లో 2,100 మంది సజీవ సమాధి!
అఫ్ఘానిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో సుమారు 2,100 మంది తమ గ్రామాల్లోనే సజీవ సమాధి అయిపోయారు. బదాక్షన్ ప్రావిన్స్ లో కురిసిన భారీ వర్షాలకు నిన్న వరదలు ముంచెత్తాయి. హోబో బారిక్ గ్రామంపై సమీపంలోని కొండ పైనుంచి పెద్ద పెద్ద రాళ్లు జారి పడడంతో 350 మంది మరణించగా, 2వేల మందికిపైగా గల్లంతయ్యారు. అయితే, 300 కుటుంబాలకు చెందిన 2,100 మందికిపైగా మరణించారని బాదాక్షన్ ప్రావిన్స్ గవర్నర్ ప్రతినిధి నవీద్ పోరోటాన్ ఈ రోజు ప్రకటించారు. 4వేల మంది వరకు చెల్లాచెదురై ఉంటారని, ఆ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఇంకా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.