: కారెం శివాజీ నివాసంలో నోట్ల కట్టలు బయటపడ్డాయ్!
మాలమహానాడు నేత కారం శివాజీ నివాసంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అయినవల్లి మండలంలో ఉన్న ఆయన ఇంట్లో ఇవాళ పోలీసులు తనిఖీలు చేపట్టినప్పుడు రూ. 19.56 లక్షల నగదు బయటపడింది. ఈ సొమ్ముకు సంబంధించిన ఆధారాలు శివాజీ కుటుంబ సభ్యులు చూపలేకపోయారు. ఈ డబ్బుకు పోలీసులు లెక్కలు అడిగితే కారెం కుటుంబ సభ్యులు నీళ్లు నమిలారు. దాంతో పోలీసులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.